మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ భాజపా కార్యకర్తలు విశాఖలో ఆందోళన చేపట్టారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయని పార్టీ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.
దిశను అమలు చేయడంలో..

స్త్రీ రక్షణ కోసం చేసిన దిశ చట్టాన్ని కఠినంగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. మహిళలపై లైంగిక దాడులు అరికట్టేందుకు ప్రభుత్వం కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : వైకాపాది ప్రజాసంకల్ప యాత్ర కాదు.. ప్రజా వంచన యాత్ర : జనసేన