సినీ, జాన పద పాటల గాయకురాలు మంగ్లీ (సత్యవతి రాథోడ్)... తన గాత్రంతో చోడవరం ప్రజలను ఊర్రుతూలూగించింది. విశాఖ జిల్లా చోడవరంలోని స్వయంభూ గౌరీశ్వర స్వామి ఆలయంలో కల్యాణ శివరాత్రి మహోత్సవాల ముగింపునకు ఆమె ముఖ్య అతిథిగా హాజరైంది.
ఆమెను ఆలయం తరుపున ప్రభుత్వ విఫ్ బూడి ముత్యాలు నాయుడు, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సత్కరించారు. గోవాడ చక్కెర కర్మాగారం ఎండీ వి. సన్యాసినాయుడు, ఆలయ కమిటీ ఛైర్మన్ గూనూరు సత్యనారాయణ, అర్చకులు, స్థానికులు పాల్గొన్నారు.