ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ 90వ జయంతి - రాష్ట్ర భాష సాంస్కృతిక అకాడమీ చైర్ పర్సన్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ .

విశాఖలో సుప్రసిద్ధ సంగీత ప్రముఖుడు, దివంగత మంగళంపల్లి బాలమురళీకృష్ణ 90వ జయంతి ఘనంగా జరిగింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు.

vishaka district
విశాఖలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ 90వ జయంతోత్సవం

By

Published : Jul 6, 2020, 5:29 PM IST

విశాఖలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సుప్రసిద్ధ సంగీత ప్రముఖులు, దివంగత మంగళంపల్లి బాలమురళీకృష్ణ 90వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తెలుగు భాషా సంఘ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్​లు పాల్గొన్నారు. బాలమురళీకృష్ణ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం బాలమురళీకృష్ణ కృతులను విన్నారు.

తెలుగు వారి సంగీత సామర్ధ్యాన్ని దశ దిశలా వ్యాపింప చేసిన బాలమురళి కృష్ణను మననం చేసుకోవటం జాతికి గర్వకారణం అని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్టాలలో ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయారని అన్నారు.

ఇదీ చదవండిజులై 8న తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా

ABOUT THE AUTHOR

...view details