విశాఖ ఏజెన్సీ హుకుంపేట మండలం డొంకినవలసలో డయేరియా బాధితులను పరామర్శించడానికి వెళ్ళిన ఎంపీడీవో ఇమాన్యుల్పై గిరిజనులు దాడి చేసిన ఘటన నిరసిస్తూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. హుకుంపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంఈఓ తిరుపతి రావు సమక్షంలో నిరసన తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ పంచాయతీ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది, మండల పరిషత్ ఉద్యోగులు నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారి గ్రామాల్లో బాగోగులు చూసినప్పుడు ఇలాంటి సంఘటనలు దారుణమని ఎంఈఓ అన్నారు. విధి నిర్వహణలో అధికారులకు భద్రత అవసరమన్నారు. ఎంపీడీవోపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎంపీడీవోపై దాడిని నిరసిస్తూ మండల పరిషత్ ఉద్యోగుల నిరసన - Visakha Agency
డయేరియా బాధితులను పరామర్శించడానికి వెళ్ళిన ఎంపీడీవో ఇమాన్యుల్పై గిరిజనులు దాడి చేసిన ఘటనను నిరసిస్తూ మండల పరిషత్ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు.
ఎంపీడీవో పై దాడిని నిరసిస్తూ మండల పరిషత్ ఉద్యోగుల నిరసన