విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం గజపతి నగరం ఎస్సీ కాలనీకి చెందిన శ్యామ్ సుందర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న కాకాడ శ్యామ్ సుందర్... సమీప శ్రీరాంపురంలో వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి పొలంలో పని ఉందని ఇంటి నుంచి బయటకు వెళ్లి ఉదయం వరకు తిరిగి రాలేదు. గ్రామ సమీపంలో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. బాధితుని తలపై కత్తితో దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గజపతి నగరం ఎస్సీ కాలనీలో దారుణ హత్య - పాయకరావుపేటలోని ఎస్సీ కాలనీలో దారుణ హత్య
విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం గజపతి నగరం ఎస్సీ కాలనీలో దారుణం జరిగింది. దళిత కాలనీకి చెందిన శ్యామ్ సుందర్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తలపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
పాయకరావుపేటలోని ఎస్సీ కాలనీలో దారుణ హత్య