విశాఖ గోపాలపట్నంలోని కొత్తపాలెంకు చెందిన మద్దాల సతీష్... ఆన్లైన్లో రమ్మీ ఆటకు బానిసయ్యాడు. నిత్యం ఆడుతూ... రూ. 25 లక్షల వరకు నగదు పొగొట్టుకున్నాడు. ఫలితంగా ఆర్థిక సమస్యలతో మనస్తాపం చెంది అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తుండగా... మేఘాద్రిగెడ్డ సమీపంలోని రైలు పట్టాల వద్ద సతీష్ మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆన్లైన్లో రమ్మీ ఆడాడు... అప్పుల బాధతో ప్రాణం తీసుకున్నాడు - విశాఖ నేర వార్తలు
ఆన్లైన్లో రమ్మీ ఆడి లక్షల రూపాయలు పోగొట్టుకోవటంతో ఓ వివాహితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన విశాఖ గోపాలపట్నంలో జరిగింది. నెల రోజుల్లోనే రమ్మీ కారణంగా బలవన్మరణానికి పాల్పడిన ఘటనలో ఇది రెండోది కావడం ఆందోళన కలిగిస్తోంది.
విశాఖలో ఆత్మహత్యకు పాల్పడిన వివాహితుడు