విశాఖ జిల్లా అనకాపల్లిలో జాతీయ రహదారి వద్ద ఓ వ్యక్తిని మరొక వ్యక్తి బండ రాయితో కొట్టి చంపాడు. స్థానిక గాంధీ నగర్ లో నివాసం ఉన్న తోకాడ సూరిబాబు (40) కు.. అనకాపల్లి జాతీయ రహదారి వద్ద ఉంటున్న శివకోటి రమాదేవి అనే మహిళతో పరిచయం ఉంది. కనకాల సత్తిబాబు అనే మరో వ్యక్తి ఆదివారం రమాదేవితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని రమాదేవి సూరిబాబుకు చెప్పగా.. అతడు సత్తిబాబు మందలించాడు.
కోపం పెంచుకున్న సత్తిబాబు సత్తిబాబు ఆదివారం మధ్యాహ్న సమయంలో సూరిబాబుని బండరాయితో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన అతడు అపస్మారక స్థితిలో ఉన్నట్టు గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సూరిబాబుని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినట్లు అనకాపల్లి ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. మృతుడి వదిన లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడు సత్తిబాబు కోసం గాలిస్తున్నమని చెప్పారు.