ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Murder at gajuwaka: వారం రోజుల్లో విదేశాలకు.. అంతలోనే హత్య..! - ap latest news

Murder at gajuwaka: మరో వారం రోజుల్లో ఓ వ్యక్తి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లనున్నాడు. ఇంతలోనే దగ్గరి బంధువుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ విషాద ఘటన.. విశాఖ జిల్లా గాజువాకలో జరిగింది.

man murdered at gajuwaka in vishakaparnam
గాజువాకలో వ్యక్తి హత్య

By

Published : Jan 23, 2022, 9:52 PM IST

Updated : Jan 23, 2022, 10:46 PM IST

Murder at gajuwaka: విశాఖ జిల్లా గాజువాకలో దారుణం జరిగింది. గోపాలరెడ్డినగర్‌లో ప్రసాద్ అనే వ్యక్తిని దగ్గరి బంధువులే హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మరో వారంలో ఉద్యోగం కోసం విదేశానికి వెళ్లనున్న ప్రసాద్​పై.. ముగ్గురు దుండగులు కత్తి, రాడ్లతో దాడిచేసినట్టు తెలిపారు. ప్రసాద్​ను హత్యచేసిన నిందితులు.. నేరుగా పోలీస్ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయారు. పాత కక్షల కారణంగానే హత్య చేసుంటారని అనుమానిస్తున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Last Updated : Jan 23, 2022, 10:46 PM IST

ABOUT THE AUTHOR

...view details