విశాఖలో ఈచ్ మైల్ మేక్ యూ స్ట్రాంగ్ పేరిట శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల నిర్వాహకులు మారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోపటియాలకు చెందిన భారతీయ ఆదర్శ మహిళా అథ్లెట్ మన్ కౌర్, బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కె ప్రసాద్ పాల్గొన్నారు. 103 ఏళ్ల వయస్సులో ఎందరికో స్ఫూర్తిని నింపుతూ ప్రపంచంలో జరిగే పలు మారథాన్‌ల్లో పాల్గొన్న మహిళా అథ్లెట్ మన్ కౌర్ ఎంతో ఆదర్శమని ... ఎమ్మెస్కె ప్రసాద్ అన్నారు. గత రెండు రోజులుగా మన్ కౌర్ ఆహారపు అలవాట్లను, ఆరోగ్య సూత్రాలను విద్యార్థులకు వివరించామని శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అధినేత వాసు ప్రకాష్ తెలిపారు.
విశాఖలో ఈచ్ మైల్ మేక్ యూ స్ట్రాంగ్ పేరిట మారథాన్ - విశాఖలో 103 ఏళ్ల మన్ కౌర్ వార్తలు
'ఈచ్ మైల్ మేక్ యూ స్ట్రాంగ్' అనే నినాదంతో విశాఖలోని శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల నిర్వాహకులు మారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 103 ఏళ్ల మహిళా అథ్లెట్ మన్ కౌర్, బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కె ప్రసాద్‌లు పాల్గొన్నారు.
![విశాఖలో ఈచ్ మైల్ మేక్ యూ స్ట్రాంగ్ పేరిట మారథాన్ man kaur and msk prasad participated in marathon at visakha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5422087-356-5422087-1576743816166.jpg)
103 ఏళ్ల మహిళా అథ్లెట్ మన్ కౌర్ ,బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కె ప్రసాద్ తో విద్యార్థులు