ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెట్టు నరుకుతుండగా విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - రోలుగుండలో విద్యుత్ అఘాతంతో వ్యక్తి మృతి

చెట్లు నరికేందుకు వెళ్లి రోడ్డుపై పడిఉన్న విద్యుత్ తీగపై అనుకోకుండా అడుగు వేశాడు ఆ వ్యక్తి. దీంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Man dies of electric shock
Man dies of electric shock

By

Published : Sep 2, 2020, 10:29 PM IST

విశాఖ జిల్లా రోలుగుంట మండలం శరభవరం గ్రామానికి చెందిన పైల శ్రీను అనే వ్యక్తి విద్యుత్ షాక్​తో మృతి చెందాడు. మృతుడు శ్రీనుతో పాటు మరి కొంత మంది చెట్లు నరకడానికి వెళ్లారు. దీనిలో భాగంగానే పంచాయతీ శివారు బాగాపురం వద్ద సరుగుడు చెట్లు నరుకుతుండగా.. అక్కడే తెగిపడిన విద్యుత్ తీగపై శ్రీను అడుగులు వేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కుమారుడు రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details