ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ లైన్లు వేస్తుండగా.. షాక్​తో వ్యక్తి మృతి - అల్లిమెట్ట విద్యుత్ లైన్లు వార్తలు

విద్యుత్ లైన్లు వేస్తుండగా షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన విశాఖ జిల్లా పద్మనాభం మండలం అర్చకునిపాలెం అల్లిమెట్ట వద్ద జరిగింది.

Man dies of electric shock at allimetta
తండ్రి మృతదేహం వద్ద ఏడుస్తున్న కొడుకు

By

Published : Jun 30, 2021, 10:35 AM IST

విశాఖ జిల్లా పద్మనాభం మండలం అర్చకునిపాలెం అల్లిమెట్ట వద్ద విద్యుత్ లైన్లు వేస్తుండగా ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. విజయరాంపురం పల్లి గ్రామానికి చెందిన పి.సత్యనారాయణ (40) అనే వ్యక్తి.. కొత్త లైన్లు వేస్తుండగా 33 కేవీ లైను తగలింది.

ఆయన కరెంట్ షాకుకు గురై అక్కడిక్కడే మరణించాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. అంతా సంతోషంగా ఉన్న సమయంలో సత్యనారయణ చనిపోవడంతో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. పద్మనాభం ప్రాంత పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details