విశాఖ జిల్లా పాయకరావుపేట పరిధిలోని అడ్డురోడ్డు వద్ద కారు ఢీ కొని వ్యక్తి మృతి చెందాడు. సమీప గెడ్డపాలెం గ్రామానికి చెందిన పినపాత్రుని వెంకట రమణ.. ఫ్యాన్ కొనేందుకు అడ్డురోడ్డుకు సైకిల్‌పై వెళ్తున్నాడు.
విశాఖ నుంచి తుని వైపు వెళ్తున్న కారు అతడిని ఢీకొట్టింది. తలకి తీవ్ర గాయం కాగా.. ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నక్కపల్లి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.