కాలువలో పడి వ్యక్తి మృతి - man fall into canal
కాలువలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన విశాఖ జిల్లా శంకరం గ్రామం సమీపంలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కాలువలో పడి వ్యక్తి మృతి
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం శంకరం గ్రామం బొజ్జన్నకొండ సమీపంలోని ఏలేరు కాలువలో పడి వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని మామిడిపాలెం గ్రామానికి చెందిన కర్రి అప్పారావు అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం భార్యతో గొడవకు దిగాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అతను ఏలేరు కాలువలో శవమై తేలాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.