విశాఖ జిల్లా రైవాడ జలాశయం సాగునీటి కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. బేతపూడికి చెందిన పసాగడ అప్పారావు(67) టైలరింగ్ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పని ముగించుకుని స్వగ్రామం వస్తున్న క్రమంలో రైవాడ జలాశయం కాలువ వద్ద బహిర్భూమికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయాడు.
ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి మృతి - విశాఖ జిల్లా రైవాడ జలాశయం వార్తలు
ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా రైవాడ జలాశయం వద్ద జరిగింది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
కాలువలో పడి వ్యక్తి మృతి
స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.