విశాఖ మన్యంలో కరోనాతో తొలి మరణం నమోదైంది. పాడేరుకు చెందిన ఓ ఉపాధ్యాయుడు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రెండు వారాల కిందట 'నాడు నేడు' పనుల సామగ్రి కోసం... చోడవరం దుకాణాలకు వెళ్లి వచ్చాడు. అప్పటి నుంచి ఆరోగ్యంలో తేడా వచ్చింది. క్వారంటైన్లో పెడతారన్న భయంతో కరోనా పరీక్షలు చేయించుకోలేదు. అప్పటికే శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు... సమస్య తీవ్రమవ్వటంతో కుటంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతిచెందాడు. వైద్యులు కరోనా పరీక్ష నిర్వహించి కరోనా పాజిటివ్‌గా నిర్ధరించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా... మృతుని ఇద్దరు కుమారులుతో పాటు మరో ఇద్దరు బంధువులు పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని అంబులెన్స్ లో శ్మశానవాటికకు తరలించారు.
కరోనా ఎఫెక్ట్: క్వారంటైన్ భయంతో తుదిశ్వాస విడిచాడు.. - పాడేరు కరోనా వార్తలు
విశాఖ మన్యంలో కరోనాతో తొలి మరణం నమోదైంది. ఓ ఉపాధ్యాయుడికి కరోనా లక్షణాలున్నప్పటికీ ఎక్కడ క్వారంటైన్‌కు తరలిస్తారో అన్న భయంతో టెస్టులు చేయించుకోలేదు. అయితే అతను అప్పటికే శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా... అది కాస్త ఎక్కువవటంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లిన గంటల వ్యవధిలోనే మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
![కరోనా ఎఫెక్ట్: క్వారంటైన్ భయంతో తుదిశ్వాస విడిచాడు.. man death due to corona in paderu at vishaka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8263887-704-8263887-1596341316524.jpg)
క్వారంటైన్ భయంతో తుదిశ్వాస విడిచాడు
ఇదీ చదవండి: