విశాఖ జిల్లా అనకాపల్లిలో యువకుడు ఆత్మహత్యచేసుకున్నాడు. కరోనా సమయంలో ఆరు నెలలుగా ఉపాధి లేకపోవడం, పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అనకాపల్లిలో క్యాటరింగ్ చేస్తున్న వ్యక్తి వద్ద పని చేశాడు.
ఉపాధి లేక బతుకు భారమై బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు. మృతుడి తల్లి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రవికుమార్ ఫోన్ లాక్ ఓపెన్ కావడం లేదని.. ఫోన్ తెరిస్తే ఆత్మహత్యకు మరేదైనా కారణం ఉంటే తెలయవచ్చని ఎస్సై ధనుంజయ తిరుపతి తెలిపారు.