విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో కోళ్లఫారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తి.. వ్యాపారంలో నష్టాలను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సీపట్నంలోని శారదానగర్‌లో నివసిస్తున్న రవి ప్రసాద్ కోళ్ల ఫాం కోళ్లఫారం నిర్వహణ సంస్థలో మేనేజర్‌గా పనిచేసేవాడు. . అందులో వ్యాపార అనుభవాన్ని పెంచుకుని సొంతంగా పౌల్ట్రీని ప్రారంభించాడు. అయితే అనుకున్నంతగా.. వ్యాపారంలో లాభాలు రాకపోవడంతో.. బాధ భరించలేక రవి ప్రసాద్ ఇంట్లోని ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని నర్సీపట్నం ఎస్ఐ లక్ష్మణరావు తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు.. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
నర్సీపట్నంలో మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య - Man commits suicide in visakha
కోళ్లఫారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తి వ్యాపారంలో నష్టాలను తట్టుకోలేద మానసికంగా ఆందోళన చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో జరిగింది.

నర్సీపట్నంలో మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య