అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న అప్పలరాజు అనే వ్యక్తి.. ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని అపార్ట్మెంట్లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మద్యానికి బానిసైన అప్పలరాజు తరచూ భార్యతో గొడవ పడి.. చనిపోతానని బెదిరించే వాడు. శనివారం రాత్రి మద్యం తాగి వచ్చి భార్య లక్ష్మితో గొడవ పడ్డాడు.
అనంతరం ఇంట్లోకి వెళ్లి తలుపు మూసేసి ఉరి వేసుకున్నాడు. ఎంతకీ తీయకపోవటంతో అపార్ట్మెంట్ వాసులు తలుపు పగలగొట్టారు. అప్పలరాజును ఆసుపత్రికి తరలించగా.. వైద్యుడు పరిశీలించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుడు పిన్ని నాగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ధనుంజయ్ తెలిపారు.