ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు... సెక్షన్ 420 కింద బుక్కయ్యాడు - cheating job offers

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను బురిడీ కొట్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి... నిందితుడిని రిమాండ్​కు తరలించినట్లు శాంతి భద్రతల డీసీపీ రంగారెడ్డి తెలిపారు.

Man arrested for cheating job offers at visakapatnam
ఉద్యోగాల పేరు చెప్పి మోసగిస్తున్న వ్యక్తి అరెస్టు

By

Published : Feb 14, 2020, 11:01 AM IST

Updated : Feb 14, 2020, 12:40 PM IST

ఉద్యోగాల పేరు చెప్పి మోసగిస్తున్న వ్యక్తి అరెస్టు

ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న నిరుద్యోగ వ్యక్తిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. గవర్నర్ బంగ్లా సమీపంలో... సన్​రైజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరుతో శ్రీనివాస్ అనే వ్యక్తి కొంతకాలంగా ఉద్యోగాల పేరిట ఆశ చూపి నిరుద్యోగుల నుంచి నగదు వసూలు చేశాడు. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సుమారు 20మంది బాధితుల నుంచి రూ.50లక్షలు వసూలు చేసినట్లు శాంతి భద్రతల డీసీపీ రంగారెడ్డి వివరించారు. నిందితునిపై ఇప్పటికే విజయవాడ, విజయనగరం పోలీస్​ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు డీసీపీ తెలిపారు. నిందితుడి వద్ద రూ.7లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:జాయింట్ కలెక్టర్​ను...భూములు క్రమబద్ధీకరణ చేయిస్తా!

Last Updated : Feb 14, 2020, 12:40 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details