మలబార్ నౌకాదళ సంయుక్త విన్యాసాలు బంగాళాఖాతంలో జోరుగా సాగుతున్నాయి. భారత్, అమెరికా, జపాన్‌లతో పాటు.. ఈ ఏడాది ఆస్ట్రేలియా సైతం జతకట్టింది. ఈ విన్యాసాలలో యూఎస్‌కు చెందిన జాన్ ఎస్. మెకైన్, జపాన్ తరపున ఒనామీ నౌకలు పాల్గొన్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన హెర్ మెజెస్టీస్, బెల్లారట్ కనువిందు చేశాయి.
మలబార్ విన్యాసాల్లో సత్తా చాటుతున్న నౌకలు - malabar exercises-2020 highlights
కొత్తగా జతకట్టిన ఆస్ట్రేలియాతో కలిసి భారత్, అమెరికా, జపాన్‌లు.. మలబార్ నౌకాదళ విన్యాసాలను ప్రారంభించాయి. నాలుగు దేశాలకు చెందిన వివిధ నౌకలు, హెలికాప్టర్లు తమ శక్తిని ప్రదర్శిస్తున్నాయి.
![మలబార్ విన్యాసాల్లో సత్తా చాటుతున్న నౌకలు malabar exercises 2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9432234-733-9432234-1604501541167.jpg)
మలబార్ నౌకా విన్యాసాలు 2020
మలబార్ నౌకా విన్యాసాలు 2020
భారత్‌కు సంబంధించిన నౌకలు రణ్ విజయ్, శివాలిక్, సుకన్య, శక్తితో పాటు జలాంతర్గామి సింధురాజ్లు తమ పాటవాన్ని ప్రదర్శిస్తున్నాయి. అత్యాధునిక జెట్ ట్రైనర్ హవాక్, పి 81, డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ సహా పలు హెలికాప్టర్లు.. క్రాస్ డెక్ ఆపరేషన్లలో పాలు పంచుకుంటున్నాయి.
ఇదీ చదవండి:అట్టహాసంగా 'మలబార్-20' విన్యాసాలు