ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మలబార్ మారిటైం విన్యాసాలు..జపాన్ చేరుకున్న దేశీయ నౌకలు - malabar 2019

మూడు దేశాల ఉమ్మడి మలబార్ విన్యాసాలు సెప్టెంబరు 26 నుంచి జపాన్ హార్బర్​లో ప్రారంభం కానున్నాయి. 8 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో భారత్, అమెరికా, జపాన్ దేశాల నౌకలు, ఎయిర్ క్రాఫ్టులు పాల్గొని పరస్పర భాగస్వామ్యం కానున్నాయి.

జపాన్​కు చేరుకున్న దేశీయ నౌకలు

By

Published : Sep 25, 2019, 7:43 PM IST

జపాన్​కు చేరుకున్న దేశీయ నౌకలు

జపాన్ వేదికగా 23వ త్రైపాక్షిక మలబార్ మారిటైం విన్యాసాలు సెప్టెంబరు 26 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబరు నాలుగు వరకు ఈ విన్యాసాలు జరుగుతాయి. త్రైపాక్షిక సహకారంలో భాగంగా జపాన్, అమెరికా, భారత్ నౌకాదళాలు పాల్గొననున్నాయి. ప్రతి రెండేళ్లకొకసారి ఈ మూడు దేశాల్లో ఏదో ఒక దేశంలో మలబార్ విన్యాసాలు నిర్వహించటం పరిపాటి. భారత నౌకాదళ బృందానికి రియర్ అడ్మిరల్ సూరజ్ బెర్రీ నేతృత్వం వహించనున్నారు. మన దేశ నౌకలైన సహ్యాద్రి, కిల్తన్​లు ఇప్పటికే జపాన్ ఓడరేవుకు చేరుకున్నాయి.

పీ8ఐ ఎయిర్ క్రాఫ్టులు, అమెరికాకు చెందిన కాంప్ బెల్, లాజ్ ఏంజిలెస్ నౌకలు, పీ8ఏ రకానికి చెందిన ఎయిర్ క్రాఫ్టులు, జపాన్ నుంచి ఇజుమో తరగతి హెలికాప్టర్, విధ్వంసకర నౌక కగ, సమిదేరి, చౌకియా నౌకలు, పీ1 ఎయిర్ క్రాప్టులు ఇందులో భాగస్వామ్యం కానున్నాయి.

మూడు దేశాల ఉమ్మడి నౌకా అవసరాలు, సముద్రయాన భద్రత, రవాణా భద్రతలో పరస్పర సహకారం, సాంకేతిక మార్పిడి వంటి అంశాలు మూడు దేశాలకు మలబార్ విన్యాసాల ద్వారా మరింత మెరుగవుతాయి. మలబార్ 2019 విన్యాసాలు సంక్లిష్టమైన విధంగా, ఎటువంటి పరిస్ధితులనైనా ఎదుర్కొనే విధంగా రూపొందించారు. జపాన్ హార్బర్​లో ఈ కార్యక్రమం జరగనుంది.

ఇదీ చూడండి:

'శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రత'

ABOUT THE AUTHOR

...view details