ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల కోసం మూడు సైజుల్లో మాస్కులు తయారు చేయిస్తున్నారు సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్. ఈ నెల ఆఖరికి వాటిని మండల విద్యాశాఖ అధికారులకు చేరవేసి వారి నుంచి ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు పంపిణీ చేయాలని యోచిస్తున్నారు విశాఖ జిల్లాకు సంబంధించి 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు 3,17202 మంది ఉన్నారు. 2019 -20 సంవత్సరంలో ఒక్కొక్కరికి మూడు చొప్పున కోటి 27 లక్షల 29606 మాస్కులను సిద్ధం చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవోను ఆదేశించారు. ఈ మాస్కులు రెండు పొరలుగా తయారుచేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
విద్యార్థుల కోసం మాస్కుల తయారీ - విద్యార్థుల కోసం మాస్కుల తయారీ
ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల కోసం మూడు సైజుల్లో మాస్కులు తయారు చేయిస్తున్నారు సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్. ఈ నెలాఖరుకి వాటిని మండల విద్యాశాఖ అధికారులకు చేరవేసి వారి నుంచి ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు పంపిణీ చేయాలని యోచిస్తున్నారు.

1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులను మూడు కేటగిరీలుగా విభజించి వారి వయసును బట్టి మూడు రకాల కొలతలతో వీటిని తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 1నుంచి 4 తరగతి వరకు మొదటి కేటగిరీగాను.. 5 నుంచి 7 తరగతి వరకు రెండో కేటగిరీ గాను... 8 నుంచి 10వ తరగతి వరకు మూడు కేటగిరీగాను విభజించారు. ఈ మూడు కేటగిరీల సైజులను సైతం జీవోలో పొందుపరిచారు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ పర్యవేక్షణలో మాస్కులు తయారీ ప్రక్రియ రెండు రోజుల క్రితం ప్రారంభమైంది. విశాఖ జిల్లాలో నర్సీపట్నం అనకాపల్లి ఎలమంచిలి పెందుర్తి ప్రాంతాల్లో కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ఈ నెల ఆఖరికి వాటిని సిద్ధం చేసి మండల విద్యాశాఖ అధికారి శాఖాధికారులకు అందజేసి వారి ద్వారా ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేస్తారు.
ఇదీ చూడండి.కొవ్వూరులోని శ్రీకృష్ణ అగ్రిప్రాసెస్పై సీబీఐ కేసు