విశాఖ ఉక్కు పరిశ్రమ కరోనా బాధితుల కోసం వెయ్యి మంచాలను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేస్తోంది. ఈ పడకలకు ఆక్సిజన్ అందించేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ జనరల్ ఆస్పత్రి.. కొవిడ్ ఆస్పత్రిగా సేవలందిస్తోంది. తోడుగా.. గురజాడ కళాక్షేత్రంలోని కొవిడ్ కేర్ సెంటర్ అందుబాటులోకి వస్తే కరోనా బాధితులకు ఉపయుక్తంగా ఉంటుంది.
కరోనా బాధితుల సౌకర్యార్థం.. వెయ్యి మంచాలు తయారీ - vizag steel plant latest news
మరో యజ్ఞానికి విశాఖ ఉక్కు కర్మాగారం శ్రీకారం చుట్టింది. కొవిడ్ రోగుల కోసం వెయ్యి మంచాలను అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు వాటి తయారీలో నిమగ్నమైంది.
కరోనా బాధితుల సౌకర్యార్థం వెయ్యి మంచాలు తయారీ