ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రేమ పేరుతో పెళ్లి.. ఆ తర్వాత వ్యభిచారానికి ఒత్తిడి!'

విశాఖలో పలువురు మహిళలను వేధిస్తున్న అరుణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మహిళా చేతన సంస్థ డిమాండ్ చేసింది. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ ప్రెస్ క్లబ్ లో బాధిత మహిళలతో మహిళా చేతన మీడియా సమావేశం నిర్వహించింది.

mahila chethana demand
నిత్య పెళ్ళికొడుకును శిక్షించాలని మహిళా చేతన

By

Published : Mar 31, 2021, 4:07 PM IST

నిత్య పెళ్ళికొడుకును శిక్షించాలని మహిళా చేతన

నిత్య పెళ్ళికొడుకు అరుణ్ కుమార్.. 8 మందితో ప్రేమ వివాహాలు చేసుకుని ఆపై వ్యభిచారం చేయాలంటూ వారిపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు బాధితులు వాపోయారు. గంజాయి, వ్యభిచార ముఠాతో అరుణ్ కుమార్ కు సంబంధాలున్నాయని వారు ఆరోపించారు. తన మాట వినకపోతే తుపాకీ, కత్తులతో బెదిరిస్తున్నాడని.. ఈ ఆగడాలు భరించలేక గత నెల కంచరపాలెం పోలీసులను ఆశ్రయించినట్లు బాధితులు పేర్కొన్నారు.

తమకు ప్రాణహాని ఉందని, తక్షణమే అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేయాలని సీపీ మనీష్ కుమార్ కు వాయిస్ మెసేజ్ పెట్టామని తెలిపారు. ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదంటూ బాధితురాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. దిక్కుతోచని స్థితిలో మహిళా సంఘాలను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. నిందితుడ్ని తక్షణమే అరెస్ట్ చేయాలని.. మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కె. పద్మ డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details