ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మహాత్మా గాంధీ జీసస్ క్రైస్ట్ ఫిలాసఫీకి ప్రభావితుడై.. మూడు సూత్రాలు పాటించారు' - Visakhapatnam District news

Prof. M. James Stephen comments: భారత దేశ జాతిపితగా పేరుగాంచిన మహాత్మా గాంధీ (మోహన్ దాస్ కరంచంద్ గాంధీ) జీసస్ క్రైస్ట్ ఫిలాసఫీకి ప్రభావితుడై.. అహింస, కరుణ, తోటి మానవుల పట్ల ప్రేమ కోసం పాటుపడ్డారని.. ఆంధ్రా యూనివర్సిటీ ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్ హబ్ డీన్, డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ పీఠాధిపతి. ప్రొఫెసర్ ఎం. జేమ్స్ స్టీఫెన్ తెలిపారు. గాంధీయన్ స్టడీస్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ జీవితానికి సంబంధించిన ఫోటో గ్యాలరీని ఆయన ప్రారంభించారు.

Professor M James Stephen
Professor M James Stephen

By

Published : Feb 18, 2023, 5:22 PM IST

Updated : Feb 18, 2023, 5:29 PM IST

Prof. M. James Stephen comments: భారత దేశ జాతిపిత మహాత్మా గాంధీ (మోహన్ దాస్ కరంచంద్ గాంధీ) జీసస్ క్రైస్ట్ ఫిలాసఫీకి ప్రభావితుడై.. అహింస, కరుణ, తోటి మానవుల పట్ల ప్రేమ కోసం పాటుపడ్డారని.. ఆంధ్రా యూనివర్సిటీ ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్ హబ్ డీన్, డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ పీఠాధిపతి, ప్రొఫెసర్ ఎం. జేమ్స్ స్టీఫెన్ తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీలోని గాంధేయ అధ్యయన కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ జీవితానికి సంబంధించిన ఫోటో గ్యాలరీని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎం. జేమ్స్ స్టీఫెన్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో గాంధేయ ఆలోచనలు, భావజాలాన్ని పెంపొందించేందుకు గాంధేయ అధ్యయన కేంద్రం నిర్వహిస్తున్న వివిధ అవగాహన, నిర్మాణాత్మక కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. మహాత్మా గాంధీ.. అహింస, కరుణ, తోటి మానవుల పట్ల ప్రేమ అనే మూడు సూత్రాలతో స్వాతంత్ర పోరాటంలో ఆయన ముందుకు సాగారని గుర్తు చేశారు. గాంధీ చెప్పిన అహింస, శాంతి, కరుణ అనే మూడు సూత్రాలు భావి తరాలకు ఎప్పటికీ సంబంధిస్తాయని వివరించారు. గాంధేయవాద పరిశోధకుడు 76 ఏళ్ల రావిప్రోలు సుబ్రహ్మణ్యంను ప్రొఫెసర్ స్టీఫెన్ సన్మానించారు.

అనంతరం గాంధీయన్ స్టడీస్ సెంటర్‌ డైరెక్టర్ డాక్టర్ చల్లా రామకృష్ణ మాట్లాడుతూ.. గాంధేయ అధ్యయన కేంద్రంలో నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాలు చాలా విలువైవని, విద్యార్థుల భవిష్యతుకు బంగారు బాటలు వేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్క్ హెడ్ ప్రొఫెసర్ ఎస్. హరనాథ్, ప్రొఫెసర్ పి. అర్జున్, గౌరవ ప్రొఫెసర్ డాక్టర్ కిషోర్ కుమార్, డాక్టర్ కృష్ణవీర్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.

Professor M James Stephen

రాబోయే రోజుల్లో విద్యార్థులకు, సిబ్బందికి, సామాన్య ప్రజలకు గాంధీ సిద్ధాంతాలను తెలియపరచడానికి, గాంధీయిజంపై పరిశోధనలు చేయడానికి 10వ ప్రణాళికలో యూజీసీ ఆంధ్ర విశ్వ విద్యాలయానికి గాంధేయ అధ్యయన కేంద్రాన్ని మంజూరు చేసింది. ఈ కేంద్రాన్ని యూవర్సిటీలోని సోషల్ సైన్సెస్ బ్లాక్‌లో అక్టోబర్ 2, 2004వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఆరోజు నుంచి నేటి వరకూ మహాత్మా గాంధీ జీవిత చరిత్ర, గాంధీ స్వాతంత్ర పోరాట సమయంలో పాటించిన సిద్దాంతాలు, స్వాతంత్యం కోసం ఆయన పిలుపునిచ్చిన పోరాటాలతో పాటు గాంధీ దక్షిణాఫ్రికాలో ఎదుర్కొన్న విషయాలను ఈ గాంధీయన్ స్టడీస్ సెంటర్‌‌‌లో గ్యాలరీ రూపంలో ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి

Last Updated : Feb 18, 2023, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details