ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్​తో వ్యక్తి మృతి..చివరి తంతు పూర్తి చేసిన సహోద్యోగులు - కరోనాతో మహారాష్ట్ర వ్యక్తి పాడేరులో మృతి

ఎక్కడో పుట్టాడు.. ఎక్కడో పెరిగాడు. కరోనా మహమ్మారి బారినపడి మారుమూల ప్రాంతంలో, అయిన వారికి దూరంగా, ఒంటరిగా ప్రాణం విడిచాడో వ్యక్తి. చివరికి సహోద్యోగుల అతడి మృతదేహనికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి..ఉద్యోగం నిమిత్తం పాడేరు వచ్చి ఏకాకిగా మృతిచెందిన వ్యక్తి దీన గాథ ఇది.

maharaahtra person last riots in paderu
మహారాష్ట్ర వ్యక్తి పాడేరులో కరోనాతో మృతి

By

Published : May 13, 2021, 12:19 AM IST

మహారాష్ట్రలోని పూణే ప్రాంతం సాల్గొన్‌కు చెందిన ప్రహ్లాద్..విశాఖ జిల్లా పాడేరులోని టెక్నో సంస్థలో మేనేజర్​గా పని చేస్తున్నాడు. కాఫీ రైతులకు పంటలో శిక్షణ ఇచ్చేందుకు ఈ ప్రాంతానికి వచ్చాడు. నాలుగు రోజుల కిందట.. తనకు కొవిడ్ లక్షణాలు ఉన్నాయంటూ తోటి ఉద్యోగులకు ఫోన్ చేశాడు. మెరుగైన చికిత్స కోసం విశాఖ తరలించాలని కోరాడు. ప్రస్తుతం అక్కడ ఆసుపత్రిలో సదుపాయాలు తక్కువగా ఉన్నందున.. అంబులెన్స్‌లో పాడేరు ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స తీసుకుంటున్నాడు.

మంగళవారం ఆరోగ్యం కాస్త మెరుగవడంతో.. వెంటిలేషన్ తీసివేశారు. తన పరిస్థితి బాగోలేదని తన వారికి ఫోన్‌లో వివరిస్తుండేవాడు. కానీ తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందాడు. మహారాష్ట్రలోని అతడి కుటుంబీకులకు ఆసుపత్రి సిబ్బంది సమాచారం అందించారు. లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల రాలేకున్నామని.. ఖననం చేయాలని వారు కోరారు. టెక్నో సంస్థ అధికారులు.. పాడేరులోని తోటి ఉద్యోగులను అప్రమత్తం చేశారు. అందరూ ముందుకు వచ్చి పీపీఈ కిట్లు ధరించి.. అన్నీ తామై మృతదేహానికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details