కొబ్బరి చిప్పలు మాటున భారీ గంజాయి తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ జిల్లా మాడుగుల మండలం డి.సురవరంలో.. 440 కిలోల గంజాయితో పాటు మహారాష్ట్రకు చెందిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న సరకు విలువ రూ. 20 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఒడిశా నుంచి మహారాష్ట్రకు లారీలో గంజాయిని తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. డి.సురవరంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా విషయం బయటపడిందని వెల్లడించారు. లారీని సీజ్ చేసి.. ఇద్దరు నిందితులను రిమాండ్‌కి పంపించినట్లు ఎస్సై రామారావు తెలిపారు.