కరోనా నేపథ్యంలో విశాఖ జిల్లా మాడుగుల మోదకొండమ్మ ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ వర్గాలు ప్రకటించాయి. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఆలయ కమిటీ ఛైర్మన్ పుప్పాల అప్పలరాజు కోరారు. రోజూ అమ్మవారి దర్శనార్ధం జిల్లా వ్యాప్తంగా భక్తులు వస్తుంటారు. ఆదివారం గుడిలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే మాడుగులలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛైర్మన్ తెలిపారు. నేటి నుంచి 10 రోజులపాటు భక్తులెవరూ ఆలయానికి రావొద్దని కోరారు.
మాడుగుల మోదకొండమ్మ ఆలయంలో దర్శనాల నిలిపివేత - మాడుగుల మోదకొండమ్మ ఆలయం
కరోనా నేపథ్యంలో విశాఖ జిల్లా మాడుగుల మోదకొండమ్మ ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ వర్గాలు ప్రకటించాయి. నేటి నుంచి 10 రోజులపాటు భక్తులెవరూ ఆలయానికి రావొద్దని ఆలయ కమిటీ ఛైర్మన్ కోరారు.

మాడుగుల మోదకొండమ్మ ఆలయంలో దర్శనాలు నిలిపివేత