ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా బట్టీలపై దాడులు.. భారీగా బెల్లం ఊట ధ్వంసం - కృష్ణాపురం నాటుసారా వార్తలు

విశాఖ జిల్లా కృష్ణాపురంలో నాటుసారా బట్టీలపై ఆబ్కారీ శాఖ అధికారులు దాడులు చేశారు. నాటు సారా తయారీకి ఉపయోగించే 2 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

natu sara
బెల్లం ఊటను ధ్వంసం చేస్తున్న అధికారులు

By

Published : Aug 12, 2020, 10:22 PM IST

విశాఖ జిల్లా మాడుగుల మండలం కృష్ణాపురంలో గుట్టు చప్పుడు కాకుండా నాటుసారా తయారీ చేస్తున్న బట్టీలపై మాడుగుల ఆబ్కారీ శాఖ పోలీసులు దాడులు జరిపారు. సీఐ బి.జగదీశ్వరరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.

సారా తయారికి ఉపయోగించే బెల్లం ఊటను 2 వేల లీటర్లు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. బెల్లం ఊటను... సారా తయారికి ఉపయోగించే ప్లాస్టిక్ డబ్బాలను ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details