ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్ఆర్ఐ కుటుంబం మృతి కేసులో ట్విస్ట్.. పెద్ద కుమారుడే ఘటనకు కారణమా? - visakapatnam district news

విశాఖ మధురవాడలో సంచలనం సృష్టించిన ఎన్ఆర్ఐ కుటుంబం మృతి కేసులో... పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనకు గల కారణాలపై ప్రాథమిక సమాచారాన్ని అందించారు. మరణించిన దంపతుల పెద్ద కుమారుడే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

death mystery in vizag
విశాఖ కేసులో కొత్త కోణం.. పెద్ద కొడుకే కారణమని పోలీసుల అంచనా

By

Published : Apr 15, 2021, 7:09 PM IST

విశాఖ మధురవాడలో సంచలనం సృష్టించిన ఎన్ఆర్ఐ కుటుంబ మృతి కేసుపై.. పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలిని పరిశీలించిన ఫోరెన్సిక్​ అధికారులు ఇచ్చిన వివరాలు విశ్లేషించారు. దంపతుల పెద్ద కుమారుడే ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్థరణకు వచ్చారు.

"సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాం. రాత్రి 9 గంటల సమయంలో చివరిగా తండ్రి బంగారునాయుడు.. వారి ఇంట్లోకి ప్రవేశించారు. పెద్ద కుమారుడు దీపక్‌ తో ఇంట్లోని వారికి వివాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నాం. ఆ సమయంలోనే మిగిలిన వారిపై అతను దాడి చేసి ఉండవచ్చు. అందుకు అనుగుణంగానే మృతులు బంగారునాయుడు, నిర్మల, కశ్యప్​ శరీరాలపై గాయాలు.. రక్తపు మరకలు ఉన్నాయి. రాత్రి వారి ఫ్లాట్​ నుంచి వాగ్వాదానికి సంబంధించిన కొన్ని కేకలు వినిపించినట్లు పక్క ఇంట్లోని వారు తెలిపారు" - విశాఖ పోలీసులు

ఇంట్లో మంటలు చెలరేగడానికి దీపక్ కారణమై ఉంటాడని.. ఆ మంటల ప్రభావంతో శ్వాస ఆడక అతను సైతం ఉక్కిరి బిక్కిరై మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతర్గత కలహాలే ఈ విషాదానికి కారణమై ఉంటుందని భావిస్తున్నామని.. అయితే వాస్తవాలు వెలికి తీసేలా దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఆ కుటుంబంలోని వాళ్లంతా చాలా మంచి వాళ్లని.. ఎవరితోనూ విభేదాలు లేవని వారి కుటుంబీకులు సైతం చెబుతున్నారని వివరించారు. పోస్టుమార్టం నివేదికలు వచ్చాక.. ఈ ఘటనపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details