మాతృభాషాభివృద్ధికి ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని శాసనమండలి సభ్యులు మాధవ్ అన్నారు. విజ్ఞాన శాస్త్రాలనూ మాతృభాషలో బోధించేందుకు అనువైన చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. తెలుగు దండు సంస్థ ఆధ్వర్యంలో... విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో ప్రాథమిక విద్యలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఉత్తరాల ఉద్యమంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు.
'ఆంగ్ల మాధ్యమంపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడటం లేదు' - vishakhapatnam latest news
విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో ప్రాథమిక విద్యలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ.. చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు మాధవ్ హాజరయ్యారు. ఈ విద్యా విధానం సరికాదని హైకోర్టు తీర్పు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడటంలేదని ఆయన ఆరోపించారు.
శాసనమండలి సభ్యులు మాధవ్
కేంద్రం ఉత్తర్వులను ఖాతరు చేయకుండా ప్రాథమిక విద్య నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని మాధవ్ డిమాండ్ చేశారు. ఈ విద్యా విధానం సరికాదని హైకోర్టు తీర్పు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.