విశాఖ జిల్లాలోని ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్ నూతన ముఖ్య ఇంజనీర్‌గా ఎం.గౌరీపతి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అక్కడి అధికారులు మర్యాద పూర్వకంగా నూతన సీఈని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సీలేరు కాంప్లెక్స్‌లో విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు అవసరమైన చర్యలు చేపడతానని గౌరీపతి అన్నారు.
సీలేరు కాంప్లెక్స్ సీఈగా గౌరీపతి బాధ్యతలు - సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజనీర్ వార్తలు
విశాఖ జిల్లాలోని ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్ ముఖ్య ఇంజినీర్‌గా ఇటీవల నియామకమైన గౌరీపతి.. ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్ ఉత్పత్తిని మెరుగుపరిచేందుకు చర్యలు చేపడతానని చెప్పారు.

Chief Engineer of Sileru Complex
కడపలోని ఆర్టీపీపీలో పర్యవేక్షక ఇంజినీర్‌గా విధులు నిర్వహించిన గౌరీపతికి పదోన్నతి కల్పిస్తూ జల విద్యుత్ కేంద్రాల ముఖ్య ఇంజనీర్‌గా ఇటీవల నియమించిన సంగతి తెలిసిందే. అలాగే సీలేరు కాంప్లెక్స్ ముఖ్య ఇంజనీర్‌గా ఉన్న మోహన్ రావును ఆర్టీపీపీ ముఖ్య ఇంజనీర్‌గా బదిలీ చేశారు.