ప్రకృతి అందాలకు నెలవైన విశాఖ మన్యంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో గల డుడుమా జలపాతం ప్రాంతంలో ఉదయం 10 గంటల వరకు మంచు కమ్ముకుని ఉంటోంది. ఇది స్ధానికులకు కొత్త అనుభూతితో పాటు, పర్యాటకులను అబ్బురపరుస్తోంది. నవంబరు నెలలోనే ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు పడిపోయాయి. కార్తీకమాసం సమీపిస్తున్న తరుణంలో మన్యంలో పర్యాటకుల రద్దీ పెరుగుతోంది.
మన్యంలో తగ్గుతున్న పగటి ఉష్ణోగ్రతలు
విశాఖ మన్యంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. నవంబరు నెల ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు పడిపోయాయి.
మన్యంలో తగ్గుతున్న పగటి ఉష్ణోగ్రతలు