విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయని వాతావరణ శాఖాధికారిణి డా.సౌజన్య తెలిపారు. పెరిగిన చలి తీవ్రతతో పగటి ఉష్ణోగ్రతల్లో సైతం పెనుమార్పులు నమోదవుతున్నాయి. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో వృద్ధులు, చిన్నారులు, వ్యవసాయ కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దట్టంగా కమ్ముకున్న పొగమంచు కారణంగా వాహనాలకు లైట్లు వేసుకుని ప్రయాణించవలసిన పరిస్థితులు నెలకొన్నాయి.
విశాఖ మన్యంలో పెరుగుతున్న చలి తీవ్రత - విశాఖలో దట్టంగా కమ్ముకున్న పొగమంచు
ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. చలి తీవ్రత పెరిగిపోతోంది. పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. విశాఖ మన్యంలో చలి కాలం ప్రారంభమయ్యింది.
![విశాఖ మన్యంలో పెరుగుతున్న చలి తీవ్రత low temparature in visakha manyam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9390472-745-9390472-1604224443001.jpg)
విశాఖ మన్యంలో పెరుగుతున్న చలి తీవ్రత