Weather Report: ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 48 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈ నెల 31వ తేదీ నాటికి వాయుగుండంగా మారనుంది. ఫిబ్రవరి ఒకటవ తేదీ నాటికి శ్రీలంకకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. ఈ నెల 30 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. సగటు ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. కోస్తా,రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు - Low pressure in the Indian Ocean
Weather Report: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న48 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయో మూడు రోజుల్లో కోస్తా, సీమ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికార్లు సూచించారు.
వాతావరణ శాఖ