Low pressure: ఉత్తర అండమాన్ తీరంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. కొద్దిగంటల్లో ఇది వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రేపటిలోగా ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని స్పష్టం చేసింది. ఈ నెల 24 తేదీనాటికి క్రమంగా ఇది ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారుతుందని ఐఎండీ తెలిపింది. అనంతరం ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చి దిశమార్చుకుని పశ్చిమ బెంగాల్- బంగ్లాదేశ్ తీరాలవైపు కదులుతుందని స్పష్టం చేసింది.
Low pressure: ఉత్తర అండమాన్ తీరంలో అల్పపీడనం.. 24 నాటికి తుపానుగా.. - ఏపీ వెదర్ రిపోర్టు
Low pressure: ఉత్తర అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడింది. కొద్దిగంటల్లో వాయుగుండంగా మారుతుందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 24 నాటికి తుపానుగా మారుతుందని, దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.
దీని ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, ఒడిశా తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఈనెల 24 నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే సూచనలు ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. అల్పపీడనం, వాయుగుండం ఏర్పడనున్న దృష్ట్యా సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని ఏపీ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లోని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. గంటకు 40-45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్టు ఐఎండీ తెలిపింది.
ఇవీ చదవండి: