ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓ ప్రేమ కథ... మూడు ప్రాణాలు... ఎన్నో మలుపులు! - suicide in vizag news

పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్న ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడటం విశాఖలో సంచలనంగా మారింది. తమకు రక్షణ కల్పించాలని వారు పోలీసులను ఆశ్రయించిన కొన్ని గంటల్లోపే ప్రాణాలు కోల్పోవటం మిస్టరీగా మారింది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

lovers suicide in vishaka
lovers suicide in vishaka

By

Published : Dec 18, 2020, 5:40 PM IST

Updated : Dec 18, 2020, 7:20 PM IST

విశాఖలోని గాజువాక శ్రీనగర్‌ కాలనీలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం రిజిస్టర్ వివాహం చేసుకుందామన్న ఓ ప్రేమ జంట... ఇంతలోనే బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పర‌వాడ మండ‌లం బోనంగి గ్రామానికి చెందిన అవినాష్(34), మోటూరు నాగిని(24) కొన్ని నెల‌లుగా ప్రేమించుకుంటున్నారు. తమకు రక్షణ కల్పించాలంటూ గురువారం పరవాడ పోలీసులను వీరు కోరారు. కశింకోటలోని దుర్గాదేవి ఆలయంలో పెళ్లి చేసుకున్నట్టు పోలీసుల‌కు చెప్పారు. అయితే వివాహాన్ని రిజిస్ట్రర్ చేయించుకుంటే ర‌క్షణ క‌ల్పిస్తామ‌ని పోలీసులు చెప్పటంతో తిరిగి వచ్చేసిన జంట... గాజువాక‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం ఉదయం రిజిస్ట్రర్ మ్యారేజ్​ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉదయం 9గంటలైనా తలుపులు తీయకపోయేసరికి ఇంటి యజమాని వచ్చి చూశారు. ఇద్దరూ ఉరికి వేలాడుతూ కనిపించారు. కంగారు పడిపోయిన యజమాని వెంటనే గాజువాక పోలీసులకు సమాచారం అందించారు.

ఆమెకు గతంలోనే వివాహం

నాగినికి ఐదేళ్ల క్రిత‌మే పాపారావు అనే వ్యక్తితో వివాహమైందని పోలీసుల విచారణలో తేలింది. అండ‌మాన్​లో ఈ దంపతులు ఉండేవారు. అయితే పిల్లలు కలగలేదన్న కారణంతో భర్తకు దూరంగా స్వగ్రామం బోనంగిలో నాగిని ఉంటోంది. ఈ క్రమంలోనే అవినాష్​తో ప్రేమలో పడింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త.. మనస్తాపంతో మూడు రోజుల క్రితం అండ‌మాన్​లో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసిందని పోలీసులు చెప్పారు.

నాగిని భర్త ఆత్మహత్యకు పాల్పడటం, తమ ప్రేమ‌ను పెద్దలు అంగీక‌రించరన్న అనుమానంతోనే గాజువాక‌లో ప్రేమ ‌జంట ఆత్మహ‌త్యకు పాల్పడి ఉంటార‌ని గాజువాక ఏసీపీ రామాంజ‌నేయ‌రెడ్డి తెలిపారు. ఇరువురి కుటుంబ‌ స‌భ్యుల ‌నుంచి స‌మాచారం తీసుకుంటున్నామ‌న్నారు.

ఇదీ చదవండి

కళ్లెదుటే కొనఊపిరితో కుమారుడు.. ఫలించని తల్లి ప్రయత్నం

Last Updated : Dec 18, 2020, 7:20 PM IST

ABOUT THE AUTHOR

...view details