విశాఖ జిల్లా మాడుగుల మండలం కేజే పురం గ్రామానికి చెందిన మచ్చా త్రిమూర్తులు(21) అనకాపల్లిలోని స్నేహితుని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలమైందని బాధతోనే ఘటనకు పాల్పడ్డాడని స్నేహితుడు తెలిపాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనకాపల్లి పట్టణ ఎస్ఐ చక్రధర్ తెలిపారు
ప్రేమ విఫలమైందని ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య - anakapalli latest news
ప్రేమ విఫలమైందని బాధతో ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది.
' ప్రేమే తనతో ఈ పని చేయించింది'