లారీ, ద్విచక్రవాహనం ఢీ... ఇద్దరు యువకుల మృతి ! - loryy accident two died
ద్విచక్రవాహనం, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈఘటన విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం బంధవీది సమీపంలో చోటుచేసుకుంది.
![లారీ, ద్విచక్రవాహనం ఢీ... ఇద్దరు యువకుల మృతి ! లారీ,ద్విచక్రవాహనం ఢీ...ఇద్దరు యువకులు మృతి !](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7640833-756-7640833-1592310626632.jpg)
విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం బంధవీది సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఏజెన్సీ ప్రాంతమైన గూడెంకొత్తవీధి మండలం దారకొండ కొండకు చెందిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై పాడేరుకు వస్తుండగా ప్రమాదం జరగింది. క్షతగాత్రులను పాడేరు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలో కిల్లో కృష్ణ, వంతాల విజయ్‌కుమార్ మృతి చెందారు. మహేశ్ అనే వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.