విశాఖ గాజువాకలో రెండు రోజులు క్రితం ఓ లారీని అపహరించారు. గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు.. లారీ డ్రైవర్ అంజిబాబుకు మాయమాటలు చెప్పి ఎంచక్కా.. ఏకంగా లారీనే దొంగిలించుకుపోయాడా దొంగ. వెంటనే సంగతిని యజమానికి వివరించాడు ఆ అమాయక డ్రైవర్. లారీ యాజమాన్యం జయలక్ష్మి ట్రేడర్స్ ప్రతినిధులు గాజువాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన రక్షకభటులు ఒడిశా పోలీసులను సైతం అప్రమత్తం చేసారు. నిందితుడు రాష్ట్రాన్ని దాటడానికి ఇచ్ఛాపురం టోల్ ప్లాజా వద్దకు రాగానే పట్టుకున్నారు. కృష్ణాజిల్లాకు చెందిన అనిల్ లారీ దొంగిలించినట్లు నిర్ధరించారు. పోలీసులు లారీని స్వాధీన పరచుకున్నారు. సుమారు ఇరువై లక్షలు విలువైన పది టైర్ల లారీ జప్తు చేసుకున్నట్టు విశాఖ క్రైమ్ పోలీస్ డిసిపి సురేష్ బాబు తెలిపారు.
రెండు రోజుల క్రితం పోయిన లారీ.. లారీతో సహా దొరికిన దొంగ - Lorry theft two days ago- theft arrested including lorry
డ్రైవర్‌కి మాయమాటలు చెప్పి ఓ దొంగ దర్జాగా లారీనే దొంగతనం చేశాడు. లారీ యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలో లారీతో సహా లారీ దొంగను పట్టుకున్న సంఘటన విశాఖ గాజువాక పరిధిలో జరిగింది.
రెండు రోజుల క్రితం పోయిన లారీ- లారీతో సహా దొరికిన దొంగ