Lorry Owners concern in Visakhapatnam: అధికారులు టార్గెట్ పూర్తి చేసుకోవడం కోసం లారీలపై అధిక జరిమానాలను విధిస్తున్నారని విశాఖలో లారీ యజమానులు ఆందోళనకు దిగారు. తమ లారీలకు అనవసరంగా జరిమానాలు విధిస్తున్న కారణంగా మైనింగ్ విజిలెన్స్ అడిషనల్ డైరెక్టర్ శివారెడ్డితో అసహనం వ్యక్తం చేశారు. అధికారులు వారి టార్గెట్‌ను పూర్తి చేసుకోవడం కోసం ఇష్టమొచ్చినట్లుగా లారీలపై అధిక జరిమానాలను విధించడం అన్యాయమని విశాఖ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. విశాలాక్షి నగర్‌లో లారీలను ఆపుతున్న స్థలానికి వెళ్లి మైనింగ్ విజిలెన్స్ అడిషనల్ డైరెక్టర్ శివారెడ్డిని ప్రశ్నించారు. తాను వైకాపా నేతనని, లారీ సంఘం అధ్యక్షుడుగా ఉన్నానని చెప్పడంతో.. అడిషనల్ డైరెక్టర్ కారులోంచి మాట్లాడుతూ తాను కూడా వైకాపానే అంటూ సమాధానం చెప్పడంతో అక్కడున్న సంఘం సభ్యులందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
విశాఖపట్టణంలో లారీ యజమానుల ఆందోళన.. ఎందుకంటే? - తమ లారీలకు అనవసరంగా జరిమానాలు విధిస్తున్నారు
Lorry Owners concern in Visakhapatnam: విశాఖపట్టణంలో లారీ యజమానులు ఆందోళనకు దిగారు. మైనింగ్ విజిలెన్స్ అధికారులు తమ లారీలకు అనవసరంగా జరిమానాలను విధిస్తున్నారని ఆవేదన చెందారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తమకు టార్గెట్ ఇచ్చారని.. ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడుకోమని చెప్తున్నారని వాపోయారు.
విశాఖలో లారీ యజమానుల ఆందోళన
ఇక్కడ లారీలన్నీ మట్టిని అమ్ముకుంటూ జీవనోపాధి చేసుకుంటారు. ఇన్ని సంవత్సరాలుగా ఎంతోమంది ఆఫీసర్లు వచ్చారు. ఇప్పుడు కొత్తగా వంశీ రెడ్డిని నియమించారు. ఆయన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టార్గెట్స్ ఇచ్చారు.. మీకు ఏమన్నా కావాలంటే.. జగన్ మోహన్ రెడ్డితోనే మాట్లాడుకోవాలని చెబుతున్నాడు. - మద్దిల వెంకట రమణ, విశాఖ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు
ఇవీ చదవండి