విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్ డైమండ్ పార్కు సమీపంలో ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయిన లారీ చెట్టును ఢీకొట్టింది. క్లీనర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించాడు. సోమవారం రాత్రి నుంచి రోడ్డుకు అడ్డంగా ఆగిపోయిన లారీని పోలీసులు జేసీబీతో తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చేశారు. ఉదయం అంబులెన్స్‌లో తీవ్రగాయాల పాలైన క్లీనర్‌ను పాడేరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన లారీ మహారాష్ట్రకు చెందినదిగా గుర్తించారు.
చెట్టును ఢీకొన్న లారీ..క్లీనర్‌కు తీవ్రగాయాలు - చెట్టుకు లారీ ఢీ తెల్లవార్లు.. క్లీనర్ నరకయాతన
ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయిన లారీ చెట్టును ఢీకొంది. క్యాబిన్లో ఇరుక్కుపోయిన క్లీనర్‌కు తీవ్ర గాయాలైన ఘటన విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్ డైమండ్ పార్కు సమీపంలో జరిగింది.
![చెట్టును ఢీకొన్న లారీ..క్లీనర్‌కు తీవ్రగాయాలు lorry hit the tree- serious injuries to cleaner](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8978541-517-8978541-1601360442407.jpg)
చెట్టును ఢీకొన్న లారీ-క్లీనర్ కు తీవ్ర గాయాలు