విశాఖ జిల్లా అనకాపల్లి సుంకరమెట్ట కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో వ్యక్తి మరణించాడు. భూపతిపాలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బలిరెడ్డి కనకరాజు అనే వ్యక్తి మృతి చెందాడు. నీలి గణేష్ అనే యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. ఒకరు మృతి - అనకాపల్లిలో రోడ్డు ప్రమాదం
విశాఖ జిల్లా అనకాపల్లి సుంకరమెట్ట కూడలి వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన లారీ
Last Updated : Oct 25, 2020, 10:05 PM IST