ఆర్కే బీచ్ వద్ద డివైడర్‌ను ఢీకొన్న లారీ
ఆర్కే బీచ్ వద్ద డివైడర్‌ను ఢీకొన్న లారీ - ఆర్కే బీచ్ వద్ద డివైడర్లను ఢీకొన్న లారీ
విశాఖలోని నోవాటెల్ డౌన్ రోడ్డులో పందిమెట్ట నుంచి ఆర్కే బీచ్ వైపు వస్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. గతంలో ప్రమాదాలు జరిగాయని పోలీసులు డివైడర్, యాక్సిడెంట్ రక్షణ బాక్సులను ఏర్పాటు చేశారు. లారీ వాటిపై నుంచి దూసుకెళ్లి ఫుట్‌పాత్‌ను ఆనుకొని ఉన్న గోడను ఢీ కొట్టింది. ఈ ఘటన ఉదయం ఐదున్నర గంటల సమయంలో జరిగింది. ఎవ్వరికీ ఎలాంటి హాని జరగలేదు.
![ఆర్కే బీచ్ వద్ద డివైడర్‌ను ఢీకొన్న లారీ lorry colloides dividers near rk beach at visakapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6032362-244-6032362-1581403066590.jpg)
ఆర్కే బీచ్ వద్ద డివైడర్లను ఢీకొన్న లారీ