విశాఖ జిల్లా ఎలమంచలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి లారీ ప్రమాదానికి గురైంది. స్థానికులు క్షతగాత్రులను అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
హైవేపై లారీ బోల్తా.. ముగ్గురికి తీవ్ర గాయాలు - విశాఖలో లారీ ప్రమాదం
లారీ బోల్తాపడి ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన విశాఖ జిల్లా రేగుపాలెం జాతీయ రహదారి వద్ద చోటు చేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
లారీ బోల్తా.. ముగ్గురికి తీవ్ర గాయాలు