మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా.. ఎం.కోడూరుకు చెందిన సూక్ష్మ కళాకారుడు గోపాల్.. సబ్బుపై మహాశివుని ప్రతిరూపం చిత్రీకరించాడు. మూడు గంటలపాటు శ్రమించి.. ఈ చిత్రాన్ని రూపొందించాడు. శివలింగంపై శివుని రూపం ఉన్నట్లుగా ఆకృతిని చిత్రీకరించారు. ఇతడు ప్రతి పండుగ.. దేశ నాయకుల జయంతి, వర్ధంతి సందర్భంగా పలు చిత్రాలను సబ్బులు, సుద్ద ముక్కలతో తయారుచేసి మంచి గుర్తింపు పొందాడు.
సబ్బుపై శివయ్యని చిత్రీకరించిన సూక్ష్మ కళాకారుడు - విశాఖ జిల్లా తాజా వార్తలు
విశాఖ జిల్లా మాడుగుల మండలం ఎం.కోడూరు గ్రామానికి చెందిన యువ సూక్ష్మ కళాకారుడు గోపాల్ తన ప్రతిభతో అందరిని ఆకటుకుంటున్నాడు. సబ్బుపై శివుని ప్రతిరూపాన్ని చిత్రీకరించి పలువురి మన్ననలు పొందుతున్నాడు.
![సబ్బుపై శివయ్యని చిత్రీకరించిన సూక్ష్మ కళాకారుడు lord siva](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10961077-106-10961077-1615452572561.jpg)
సబ్బుపై శివుని రూపాన్ని చిత్రికరించిన సూక్ష్మ కళాకారుడు