విశాఖ జిల్లాలో వినాయక విగ్రహాల తయారీ కొనసాగుతోంది. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో విగ్రహాలను పరిమితంగానే తయారు చేస్తున్నారు. జిల్లాలోని రోలుగుంట, రావికమతం మండలాల్లో విగ్రహాలు తయారీ ఎక్కువగా జరుగుతుంది. కొత్తకోట, దొండపూడి, కంచుగుమ్మల ప్రాంతాల్లో తయారీ శిబిరాలు ఏర్పాటు చేశారు.
ఇక్కడనుంచి ఏటా అనకాపల్లి, చోడవరం, చింతపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, మాకవరపాలానికి విగ్రహాలు వెళ్తుంటాయి. దీనికోసం పెద్దఎత్తున గణపతులను తయారు చేసేవారు. అయితే ఈ ఏడాది కరోనా లాక్డౌన్ కారణంగా పరిమితంగా విగ్రహాలను చేస్తున్నట్లు తయారీదారులు తెలిపారు. అట్టహాసాలకు వెళ్లకుండా మట్టితో గణపయ్యలను చేస్తున్నట్లు వివరించారు. ఈ సంవత్సరం విగ్రహాల వ్యాపారం పెద్దగా ఉండదని వారు అభిప్రాయపడుతున్నారు.