విశాఖ జిల్లాలో సింహగిరిపై వేలసిన లక్ష్మీ నరసింహ ఆలయంలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలను ప్రారంభించారు. తెల్లవారుజామున 5 గంటలకు నెలగంట మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ నెల 24 వరకు జరిగే పగల్‌పత్తు ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం స్వామివారి తిరువీధి సేవ నిర్వహించనున్నారు. అనంతరం 25 నుంచి జనవరి 3 వరకు రాపత్తు ఉత్సవాల సందర్భంగా సాయంత్రం 5 గంటలకు తిరువీధి సేవ జరిపిస్తారు. జనవరి 10 నుంచి 14వ వరకు పవిత్ర గంగధార వద్ద స్వామివారి ధారోత్సవాలు ఘనంగా జరుపనున్నారు. ఈ సందర్భంగా జనవరి 10 నుంచి 15 వరకు స్వామి వారికి జరిపే నిత్య కల్యాణోత్సవం, ఆర్జిత సేవలను రద్దు చేశారు. జనవరి 13 భోగి రోజున గోదాదేవి కల్యాణంతోపాటుగా స్వామివారికి నిత్యకల్యాణం కన్నుల పండువగా నిర్వహించనున్నారు.
సింహగిరిపై ఘనంగా నెలగంట మహోత్సవం
సింహచలవాసుడు శ్రీ లక్ష్మీ నరసింహుడు కొలువైన సింహగిరిపై నెలగంట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ధనుర్మాస ఉత్సవాలను ప్రారంభించారు.
సింహగిరిపై ఘనంగా నెలగంట మహోత్సవం
TAGGED:
simhagiri latest news update