వేగంగా తిరిగే చెయిన్.... అంతకు మించి వేగంగా తిరిగే చేయి... వెరసి ఒట్టి చేతితోనే ఇద్దరిని అవలీలగా మట్టి కరిచేట్టుగా చేయడం మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకత. తండ్రి వారసత్వాన్ని తమ అభ్యాసం ద్వారా ఔపోసన పట్టిన కవలలు లేఖాజ్ కుమార్,లోహిత్ కుమార్ లు. తమ సాధన ద్వారా ఇప్పటికే రికార్డులను నెలకొల్పి పలు రికార్డు పుస్తకాల్లోకి ఎక్కిన వీరు ఇప్పుడు రక్షణ దళాల్లో చేరేందుకు అవిశ్రాంత కసరత్తు చేస్తున్నారు. యువత ఆశలకు ఆశయాలకు సిసలైన ప్రతి రూపాలుగా ఉన్న వీరిని ఇటీవలే ప్రపంచ రికార్డుల యూనివర్సిటీ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకమైన నాన్ చాక్ రొటేషన్ లో గౌరవ డాక్టరేట్ లను కూడా ఇచ్చింది. తమ ఈడు పిల్లలలో ప్రత్యేకంగా కనబడే విధంగా మొదలైన కరాటే ప్రస్ధానం ఇప్పుడు అంతర్జాతీయ రికార్డుల దిశగా ఈకవలలు పరుగులు తీస్తున్నారు.
రెప్పమూసి తెరిచేలోపు చెయిన్ తిప్పడం ద్వారా ప్రత్యర్ధికి భీతిగొలిపేలా చేయడం మార్షల్ ఆర్ట్స్ లో ఒక ప్రత్యేకత. దీనినిలో అత్యంత కఠోర సాధన ద్వారా పట్టు సాధిస్తున్న ఈ యువకులు ఇద్దరూ కవలలు లేఖాజ్ కుమార్,లోహిత్ కుమార్. విశాఖ కు చెందిన స్టీల్ ప్లాంట్ సమీపంలోని దేశపాత్రుని పాలెంకి చెందిన ఉక్కు ఉద్యోగి ఏవీ రామారావు.. కరాటే రాముగా సుపరిచతం. వీరితనయులే ఈ కుమార్ల ద్వయం. కరాటేలో దేహధారుఢ్య సాధనలో ప్రత్యేకత సాధించిన రామరావుకి పలు రికార్డులు ఉన్నాయి. చిన్నతనం నుంచి ఈయన సాధన పిల్లలను ఈ వైపుగా దృష్టి పెట్టేట్టుగా చేసింది. ఫలితంగా వీరిద్దరూ తమ నైపుణ్యం ద్వారా పలు రికార్డులను సాధించారు.
ఎనిమిదేళ్ల క్రితమే తన తండ్రి ఇస్తున్న 36 గంటల నాన్ స్టాఫ్ నాన్ చాక్ రొటేషన్ లో పాలు పంచుకుని అందరి ప్రశంసలు పొందగలిగారు. ఇది అప్పుడే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తమ పేర్లు నమోదు చేసుకునేట్టుగా చేసింది. తర్వాత స్టేట్ బుక్, తెలుగు బుక్, ఇండియా బుక్, అసియా బుక్, వరల్డ్ రికార్డ్స్ ఇండియా, వరల్డ్ అమేజింగ్ రికార్డ్స్ లలో తమ పేరు నమోదు చేసుకునేట్టుగా చేశారు.ఇటీవలే వీరికి యూకె కి చెందిన వరల్డ్ రికార్డ్స్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను అందించింది. బ్రిటన్ లేదా వియత్నాంలలో వీటిని అందుకోవాల్సి ఉన్నప్పటికి కరోనా కారణంగా వాటిని పోస్ట్ ద్వారానే తీసుకోవాల్సి వచ్చింది. ప్రతి రంగంలోనూ ప్రపంచ స్ధాయి, జాతీయ స్దాయి రికార్డుల నెలకొల్పిన వారు ఆయా ఆంశాల్లో వారు చూపే ప్రతిభ ఆధారంగా వీరికి ప్రోత్సాహకంగా ఈ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ లను ఇస్తుంది. వీరితండ్రే వీరికి శిక్షకుడు కావడం వల్ల మరింతగా వీరు రాటుదేలారు.తమ పిల్లలు చిన్నప్పటి నుంచి ఉన్న ఆసక్తి వారిని ఈ స్ధాయికి చేర్చిందన్నది తల్లి సొనా ఆనందంగా చెబుతున్నారు.
దేశ రక్షణ రంగంలో చేరడం ద్వారా తమ నైపుణ్యాలను దేశానికి ఉపకరించే విధంగా చేయాలన్నది తమ లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ కుమార్ ల ద్వయం చెబుతున్నారు. అన్నట్టు వీరికో అన్నయ్య చాణుక్య ఉన్నాడు. తను తొలుత కరాటేలో సాధన చేసినా, తర్వాత మాత్రం క్రికెట్లో జాతీయ స్దాయి చేరి, ప్రస్తుతం సివిల్స్ మెయిన్స్ కి సాధన చేస్తున్నాడు. దేహధారుఢ్యం ద్వారా నవ భారత నిర్మాణానికి వీరు ప్రతీకలుగా ఉన్నారు.
కరాటేలో ప్రతిభ చూపుతున్న లోఖజ్, లోహిత్ - VISHAKA LATEST UPDATES
రెప్పపాటు కాలంలో నాన్‌చాక్‌ను తిప్పుతూ ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించడం మార్షల్ ఆర్ట్స్ ప్రత్యేకత. తండ్రి స్ఫూర్తితో ఆ రంగంలో రాణించాలనే తపనతో పసిప్రాయం నుంచే కరాటేలో సాధన చేస్తున్నారు... ఇద్దరు సోదరులు. చురుకుతనం, ఆసక్తి, క్రమశిక్షణతో మేటిగా రాటుదేలారు. నాన్‌చాక్‌తో అద్భుతాలు చేస్తూ... తండ్రి నెలకొల్పిన రికార్డును తనయులే బద్దలు కొట్టారు. అత్యుత్తమ ప్రదర్శనలతో... గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని సైతం అందుకున్నారు...విశాఖకు చెందిన లోఖజ్, లోహిత్‌లు
కరాటేలో మంచి ప్రతిభ కనబరుస్తున్న లోఖజ్, లోహిత్
ఇవీ చదవండి