ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆనందయ్య మందుపై సరైన పరీక్షలు జరగాలి: లోకేశ్ - నెల్లూరు ఆనందయ్య తాజా వార్తలు

నెల్లూరు ఆనందయ్య మందుపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఆనందయ్య మందుపై సరైన పరీక్షలు జరగాలని కోరారు.

ఆనందయ్య మందుపై సరైన పరీక్షలు జరగాలి: లోకేశ్
ఆనందయ్య మందుపై సరైన పరీక్షలు జరగాలి: లోకేశ్

By

Published : May 24, 2021, 5:10 PM IST

ఆనందయ్య ఇప్పటివరకు చాలామందికి మందు ఇచ్చారని నారా లోకేశ్ అన్నారు. తనకు అందిన సమాచారం ప్రకారం చాలామంది కోలుకున్నారన్నారు. మార్కెట్లో రెమ్​డెసివర్ ముందు కూడా దొరకడం లేదని.. ఈ సమయంలో కరోనాపై ఆయుర్వేదం మందు పని చేస్తే.. సరైన పరీక్షలు చేసి ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లోకేశ్ అన్నారు.

కరోనా సమయంలో తెదేపా సేవలందిస్తుందన్నారు. విదేశాల్లో వైద్యులు సైతం తెదేపా తరఫున సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:హైవే కిల్లర్‌ మున్నా కేసులో సంచలన తీర్పు.. 12 మందికి ఉరిశిక్ష

ABOUT THE AUTHOR

...view details